సిర్పూర్ టి: పీజీ సెట్ లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు సాధించిన రాస్పల్లి విద్యార్థి, అభినందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్ మండలం రాస్పల్లి గ్రామానికి చెందిన బొమ్మెళ్ళ ప్రవీణ్ ఇటీవల విడుదలైన పిజి సెట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించాడు. దీంతో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులకు ప్రవీణ్ స్ఫూర్తిగా నిలిచారని ఈ సందర్భంగా విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు,