పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి, ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్నాం పోలీసులు ఆ వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. మరింత సమాచారం తెలియవలసి ఉంది.