అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నార్పలకు చెందిన తండ్రి కుమార్తెలకు గాయాలయ్యాయి. ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి మలుపు తిప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వేన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.