సత్తుపల్లి: తెలంగాణ సరిహద్దు ముత్తగూడెం వద్ద పందెం పుంజులతో ఏపీ కి వెళ్తున్న పందెం రాయాళ్లను స్టేషన్ కు తరలించిన పోలీసులు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని తెలంగాణ సరిహద్దు ముత్తగూడెం గ్రామం వద్ద పలువురు పందెం రాయుళ్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర సరిహద్దులోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆంధ్రాలో జరిగే కోడిపందాలకు తెలంగాణ నుండి పందెం పుంజులతో వెళుతున్న పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకొని కోడిపుంజులను స్వాధీనం చేసుకుంటున్నారు.ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.మరోవైపు డ్రోన్ కెమెరాలతో ఆంధ్ర,తెలంగాణ సరిహద్దు గ్రామాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు