పూతలపట్టు: కాణిపాకం ఆలయ చైర్మన్ గా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన మనీ నాయుడు
తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉండి నిరంతరం పార్టీకి సేవలు అందిస్తున్నందుకు బుధవారం రాష్ట్ర దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం చైర్మన్గా వి. సురేంద్ర నాయుడు @ మణి నాయుడు రెండో సారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను అభినందించి, చైర్మన్ పదవిలో విజయవంతంగా కొనసాగి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.