యర్రగొండపాలెం: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కుటమీ నాయకులు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ చేశారు. అనంతరం అధికారులు కూటమి నాయకులు విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.