ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీని ఢీకొన్న కారు, ముగ్గురికి గాయాలు కారు డ్రైవర్ పరార్
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళపల్లి నుంచి పోచారం వెళ్లే దారిలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివిఆర్ కాలేజ్ సమీపంలో స్కూటీపై వెళుతున్న ముగ్గురిని కారు ఢీకొనింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.