పామూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అదేవిధంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. పామూరు మండలంలో టిడిపి బలోపేతానికి కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు టిడిపిలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పామూరు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.