దర్శి: పూరిమెట్ల గ్రామంలో విష జ్వరాలతో మంచానికే పరిమితమైన గ్రామస్తులు
Darsi, Prakasam | Sep 15, 2025 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో విష జ్వరాలతో గ్రామస్తులు మంచానికే పరిమితమయ్యారు. గత కొన్ని రోజులుగా సీజనల్ వ్యాధుల వల్ల గ్రామంలో దాదాపు అందరికీ విష జ్వరాలు వ్యాప్తి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. వారు తమ గ్రామానికి వచ్చి పరిశీలించారు. వైద్య సిబ్బందితో జ్వరాలు తగ్గడానికి చర్యలు తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో 300 గడపలు ఉంటాయని సుమారు 300 మందికి ఇదే పరిస్థితి అని వారు తెలిపారు.