నిర్మల్: రైతులు ఎవరు అధైర్య పడవద్దు ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటాం: తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
Nirmal, Nirmal | Sep 17, 2025 రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువు కట్టను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో చెరువు తెగిపోవడం బాధాకరమని, రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగు చేసుకుంటున్నారని, వరి పంట పొలాల్లో ఇసుకమేటలతో నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే