తంబళ్లపల్లె కోర్టుకు జోగి బ్రదర్స్ . భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజవర్గం మొలకలచెరువు మండలంలో నకిలీ మద్యం కేసులో అరెస్టై జోగి బ్రదర్స్ ను పిటి. వారెంట్ పై తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి వద్ద మంగళవారం హాజరపరిచిన ఎక్సైజ్ పోలీసులు. కోర్టు వద్ద భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు