పూతలపట్టు: కాణిపాకం వరసిద్ధుడి సేవలో ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. తిరుపతి పర్యటన అనంతరం ఆయన కాణిపాకం ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఆలయ ఈవో పెంచల కిషోర్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు.