స్వస్త్ నారీ శక్తి కార్యక్రమంలో అవగాహన కల్పించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు బుధవారం జరిగిన నారీ శక్తి (మహిళలకు వ్యాధులపై అవగాహన) కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో వచ్చే వ్యాధులు గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ నారీ శక్తి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రజలు తెలుసుకుని వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.