గిద్దలూరు పరిసర ప్రాంతాలలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గురువారం డీఎస్పీ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన రెండు లారీలు ఢీకొని ఓ లారీ మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడని డిసెంబర్ 31వ తేదీన డీసీఎం వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగి డీసీఎం వాహనం డ్రైవరు సజీవ దహనం అయ్యాడు. మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమని వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడపలని డి.ఎస్.పి వాహనదారులకు సూచిస్తున్నారు.