పాణ్యం: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై దాడిని ఓర్వకల్లు మండల MRPS, నేతలు ఖండించారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై దాడిని ఓర్వకల్లు మండల ఎమ్మార్పీఎస్ నేతలు ఖండించారు. మంగళవారం ఓర్వకల్లు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షుడు బండమీది నారాయణ మాదిగ మాట్లాడుతూ న్యాయస్థానంపై దాడి లౌకిక విలువలపై దాడిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీను మాదిగ, రామకృష్ణ మాదిగ, రాజు మాదిగ పాల్గొన్నారు.