శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లిలో మరోభవనాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించినందుకే అంటున్న హైడ్రా అధికారులు
సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చి వేసింది హైడ్రా. గత కొంత కాలంగా ఈ భవన నిర్మాణం పై అనేక ఆరోపణలు రావడంతో పాటు జీహెచ్ఎంసీ, హైకోర్టు కూడా నోటీసు అందజేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయినా నోటీసులకు స్పందించకుండా నిర్మాణం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. నేడు కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు