బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి 13.5 లక్షల విలువైన 19 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 25, 2025
ప్రకాశం, పల్నాడు జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, అద్దంకి పోలీస్ స్టేషన్స్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఒంగోలు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 13లక్షల విలువైన 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం గురవాయి పాలెంకు చెందిన ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడి ఇళ్ల బయట, షాపుల వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను వీరు దొంగిలించినట్లు ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్. నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన సిసిఎస్ సీఐ జగదీష్,తాలూకా సిఐ