తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 35 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 175 మంది దరఖాస్తు చేసుకోగా, 140 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.తంబళ్లపల్లె, పెద్ద మండ్యం, ములకలచెరువు మండలాలకు చెందిన పలు పాఠశాలల 5వ తరగతి విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాశారు. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సిఎల్ఓ షీబా పర్యవేక్షణలో పరీక్ష సజావుగా నిర్వహించబడింది.