వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కు నివాళులర్పించి పోస్టర్లను విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.