అదిలాబాద్ అర్బన్: సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను భావి తరానికి తెలియచెప్పేలా పండగలను ఘనంగా జరుపుకోవాలి :అదనపు కలెక్టర్ శ్యామలాదేవి
సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను భావి తరానికి తెలియచెప్పేలా పండగలను ఘనంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. అధికారిక బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆదిలాబాద్ లోని మునిసిపల్ మెప్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సలోనితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వద్ద గౌరమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. మహిళా సిబ్బందితో కలిసి సరదాగా కోలాటాలు ఆడుతూ బతుకమ్మ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు