అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఐ జి కాలనీలో శనివారం నాలుగు గంటల 25 నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ కూటమినేతలతో కలిసి సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ కూటమి నేతలు మాట్లాడుతూ కక్కలపల్లి పంచాయతీ ఐ జి కాలనీ నుంచి కళ్యాణదుర్గం రోడ్డు వరకు రోడ్డు లేక 20 సంవత్సరాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతోనే ఈ సమస్య పరిష్కరిస్తూ సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభిస్తున్నామని టిడిపి జనసేన బిజెపి నేతలు పేర్కొన్నారు.