గంగాధర నెల్లూరు: వైసీపీని నేను నమ్ముకున్నానే గానీ,అమ్ముకోలేదు: వెదురుకుప్పం మండల మాజీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి
వైసీపీ పార్టీని నేను నమ్ముకున్నానే.. కానీ ఏనాడు అమ్ముకోలేదని వెదురుకుప్పం మండల మాజీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి శనివారం అన్నారు. పార్టీ తనను సస్పెండ్ చేశారంటూ వచ్చిన లేఖ ఎంతగానో బాధించిందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో నారాయణస్వామి ఓ సారి, ఇన్ఛార్జ్ హోదాలో కృపాలక్ష్మి మరో సారి తనను అకారణంగా బహిష్కరించడం మంచిది కాదన్నారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్నామన్నారు.