శ్రీకాకుళం: ఓ మహిళ 10 కిలోల గంజాయితో పలాస రైల్వే స్టేషన్లో పట్టుబడినట్లు తెలిపిన సిఐ సూర్యనారాయణ
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళ వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా సుమారు 10 కిలోల గంజాయి పట్టుబడినట్లు మంగళవారం సిఐ సూర్యనారాయణ మీడియాతో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గంజాయి ను స్వాధీనం చేసుకొని మహిళను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.