పల్నాడు జిల్లా, పెదకూరపాడుకు చెందిన టిడిపి నేత పొలం అమ్మినట్లు నకిలీ పత్రాలతో మోసం చేశాడని ఎన్నారై మహిళ నగరంలో ఆరోపించింది. శనివారం రాత్రి నగరంలో బాధితురాలు మీడియాతో మాట్లాడారు గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు మధ్యవర్తిత్వం వహించి పెదకూరపాడు కు చెందిన టిడిపి నేత జాన్ సైదాతో వ్యవసాయ భూమి ఉందని తప్పుడు పత్రాలు సృష్టించి తనను మోసం చేశారని ఆమె తెలిపింది. అసలు స్వయంగా డాక్యుమెంట్ లో ఉన్న పొలం వద్దకు వెళ్లి చూడగా పొలం రైతు తాను ఎవరికి భూమి అమ్మలేదని తెలిపినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.