ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో నాటు సారా బట్టిలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు
ఉదయగిరి దుర్గం పల్లి అటవీ ప్రాంతంలో హనుమాన్ నాలకు అర కిలోమీటర్ల దూరంలో నాటు సారా తయారీ బట్టిలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం దాడులు చేశారు. ఈ ప్రాంతంలో నిన్న మేకల కాపరులు నాటు సారా భట్టిలను గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు సోమవారం ఉదయం దాడి చేసి 200 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నాటు సారా తయారు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.