మంత్రాలయం: అమెరికా అధ్యక్షుడు భారతదేశంలో విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా పెద్ద కడబూరు లో వ్యవసాయ కార్మిక సంఘం నిరసన
పెద్ద కడబూరు:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా పెద్ద కడబూరులోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ట్రంప్ ఫొటోను దగ్ధం చేశారు. ట్రంప్ నిరంకుశ ధోరణి నశించాలని నినాదాలు చేశారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల మూలగా దేశంలో పలు వర్గాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇందులో వ్యవసాయ కార్మిక సంఘం నేతలు తిక్కన్న, ఈరన్న, దేవదాసు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.