పత్తికొండ: పత్తికొండ మండలంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి క్రాంతి నాయుడు
పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ సమీపంలో నిర్మిస్తున్న టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి క్రాంతి నాయుడు సోమవారం పరిశీలించారు. పునాదుల వరకు మాత్రమే పనులు పూర్తయినట్లు గుత్తేదారులను ప్రశ్నించారు. మూడు-నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. టమాటా దిగుబడులు భారీగా రాకముందే పరిశ్రమ ప్రారంభించాల్సిందని సూచించారు.