కండలేరు అధికారులతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్ష
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వలన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నెల్లూరు జిల్లా రాపూరు కండలేరు జలాశయాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగోండ్ల రామకృష్ణ సందర్శించారు. వర్షాల కారణంగా ముంపు ప్రాంత గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సమీక్ష నిర్వహించారు.