సూర్యాపేట: చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి నివాళులు
సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బిఆర్ఎస్ నాయకులు గుండ గాని రాములు గౌడ్ గోపగాని రమేష్ గౌడ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం తుంగతుర్తి లోని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమికోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.