శ్రీకాళహస్తి: సహకార వారోత్సవాల ప్రారంభం శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆవరణలో ఛైర్మన్ ఖాదర్ బాషా అధ్యక్షతన సహకార వారోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. బ్యాంక్ CEO ధనంజయులు పాల్గొన్నారు. ముందుగా సహకార పతాకానికి పూజ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. సహకార వారోత్సవాల ప్రాధాన్యాన్ని ప్రజలకు చేరువ చేయడం, సహకార సంస్థల సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పలువురు పేర్కొన్నారు.