పిఠాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద రెండవ రోజు లేఖర్లు నిరసన .
కాకినాడ జిల్లా పిఠాపురంలో దస్తావేజు లేఖరుల నిరసన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన లోప భూయిష్టమైన 2.0 విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు ఆందోళన శనివారం రెండో రోజుకి చేరింది. పెన్ డౌన్ పాటించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు స్తంభించాయి. ఈ విధానం వలన తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఓటీపీలు బహిర్గతం చేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారని లేఖరులు తెలిపారు.