సరస్వతి శిశు మందిర్ పిల్లల ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ - సురక్షిత సాగర్
-పులికాట్ సరస్సు వద్ద చెత్త క్లీన్ చేసిన చిన్నారులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల యాజమాన్యం వారు శనివారం స్వచ్ఛ సాగర్ - సురక్షిత్ సాగర్ అనే కార్యక్రమాన్ని చిన్నారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సులోచన, తమ చిన్నారులను, శ్రీహరికోట వెళ్లే రహదారిలో, పులికాట్ తీర ప్రాంతానికి తీసుకువెళ్లి స్వచ్ఛ సాగర్ యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు.