బండిఅత్మకూరు మండలం జిసి పాలెం వద్ద తెలుగుగంగ కాల్వకు గండి పడింది. కాల్వ తొమ్మిదవ కిలోమీటరు వద్ద గండి ఏర్పడడంతో నీరు పొలాల్లోకి వృథాగా చేరుతోంది. సమాచారం అందుకున్న నీటి సంఘాల నాయకులు ఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులకు తెలియజేశారు. గండి పడిన ప్రాంతంలో అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.