సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షం, ఇండ్లలోకి వచ్చి చేరుతున్న వరద నీళ్లు
సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్నగర్, చింతల మానేపల్లి మండలాలతో పాటు పలు గ్రామాలలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా వరద నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ మొత్తం జలమయంగా మారింది. సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే వరద నీళ్లు మొత్తం ఇండ్లలోకి వచ్చి చేరుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,