సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కదిరి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి ఆర్డీవో వివిఎస్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలో ప్రాణాంతకమైన వ్యాధుల మందులకు సంబంధించి జీఎస్టీని పూర్తిగా రద్దు చేసిందని తెలియజేశారు. అదేవిధంగా వైద్య పరికరాలపై జిఎస్టి తగ్గించిందని అన్నారు.