నరసన్నపేట: పారా మిలటరీ సంఘ సంక్షేమ భవనం నరసన్నపేటలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా వుంది MLA బగ్గు రమణమూర్తి
జిల్లాలో ఉన్న పారా మిలిటరీ సంఘ సంక్షేమ భవనం నరసన్నపేటలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రధాన రహదారిలో స్థానిక పైడితల్లి ఆలయం వద్ద నిర్మించిన సంక్షేమ భవనాన్ని బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార మిలిటరీ దేశానికి చేస్తున్న సేవ ఎనలేనిదని కొనియాడారు... వారి సంక్షేమ అభివృద్ధికి తనవంతు కృషిని ఎల్లవేళలా అందిస్తానని పేర్కొన్నారు....