ఏలేశ్వరంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
కాకినాడజిల్లా ఏలేశ్వరం గ్రామంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనం అన్న ప్రసాద వితరణ అత్యంత ఘనంగా నిర్వహించినట్లు అన్నవరం ఈవో సుబ్బారావు తెలిపారు