రాయదుర్గం: పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం, పాల్గొన్న జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి
రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. పట్టణంలో జరిగిన ఈ సమావేశంలో మెట్టుగోవిందరెడ్డి తో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, పరిశీలకులు మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి హాజరై నాయకులు కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. వైసిపి అధికారంలో ఉన్నా టిడిపి నాయకులు ఏరోజూ ఇబ్బంది పడలేదన్నారు. ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని ధ్వజమెత్తారు.