తాడిపత్రి: శాంతి భద్రతల సమస్య నేపథ్యంలో వైసీపీ యాడికి లో కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాం: తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్ కుమార్
తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ పార్టీల నాయకులు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి కోరారని,వైసీపీ ప్రజా ఉద్యమం ర్యాలీ యాడికి లో చేసుకోవడానికి అనుమతి ఇచ్చామని ఏఎస్పీ రోహిత్ కుమార్ చెప్పారు.బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు.రెండు గ్రూపులు క్లాష్ కాకుండా,శాంతి భద్రతలకు భంగం కలగకుండా టీడీపీ కి తాడిపత్రి లో,వైసీపీకి యాడికి లో కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు.