ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం కళానృత్యనికేతన్ గురువులు బిందు అభినయ్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.భజ మానస, అష్టలక్షిమి,అంబా నీరాజనం, అన్నమాచార్య కీర్తన,పూజానృత్యం, మోదమున, రామచంద్రయ్య, ఝేమ్ ఝేమ్, జతిస్వరం, నమఃశివాయతే, జయము జయము, హిందోళతిల్లాన అంశాలను అశ్విత, మంజుశ్రీ, హర్షిక, అనన్య, హిమ వర్దిని, నిధి, రిషిత, రిషిక, మనస్విని, ఆరాధ్య, గీర్షిక, శ్రీహిత, సిదిక్ష, దీపికా, మోహిషా, ఛార్ణిత మొదలైన వారు ప్రదర్శించి, మెప్పించారు.