గిద్దలూరు: నిబంధనల మేరకు నడుచుకుంటూ దీపావళి మందు టపాసులను విక్రయించుకోవాలన్నా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు
దీపావళి మందు సామాగ్రి విక్రయించే దుకాణదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు సూచించారు. అధికారులు చెప్పిన విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ మందు సామాగ్రి విక్రయించుకోవాలని అలా కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాత్కాలిక అనుమతుల లైసెన్స్ తీసుకోకుండా ఎవరైనా దీపావళి మందు సామాగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.