నల్గొండ: పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యత వహించాలి: AIMIM నాయకులు
నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు భూములను ఆదివారం సాయంత్రం పలువురు ఏఐఎంఐఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ లోని ముస్లింల ఓట్లతో గెలిచి ముస్లింల వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం చేస్తున్నాడని ఆరోపించారు. నల్గొండ పట్టణంలోని ముస్లింలకు చెందిన విలువైన భూములను తన అనుచరుల కోసం బలి చేస్తున్నాడని మండిపడ్డారు. ముస్లింల భూముల నుండి వెళ్లే ఘాట్ రోడ్డును అడ్డుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే మంత్రి కోమటిరెడ్డి బాధ్యత వహించాలన్నారు.