అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో ఇద్దరిపై కట్టెలు రాడ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఉప్పరపల్లికి చెందిన సురేంద్ర లక్ష్మన్న లను అదే గ్రామానికి చెందిన నాగేంద్ర నాగేంద్రమ్మ బాలరాజు తో పాటు మరికొంతమంది దాడి చేసి గాయపరిచినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.