జగిత్యాల: రాయికల్ పట్టణ కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నీటి కుంటను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల నియోజకవర్గం రాయికల్ పట్టణ కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నీటి కుంటను, కల్వర్టులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మురికి నీరు కుంటలో చేరకుండా చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేస్తే రాయికల్ పట్టణంలో మరో హుస్సేన్ సాగర్ లాగా రాయికల్ పట్టణ నడి ఒడ్డున సుందరికారంగా ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మారుతుంది అన్నారు. ఇందుకు నిధులు సమస్య కాదనీ, అంబెడ్కర్ విగ్రహం సమీపంలోని కుంట సుందరికరణ ప్రధానం అన్నారు.కుంట చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేయాలని సూచించారు.ప్రభుత్వం ప్రతి మున్సిపల్ కి 15 కోట్లు మంజూరు చేస్తుంద.