భీమిలి: జోన్2 ప్రజా పిర్యాదుల స్వీకరణలో 17 వినతులు, జోన్2 కమీషనర్ కనకమహాలక్ష్మి వెల్లడి
ప్రజాపిర్యాదులు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం (PGRS) జోన్ 2 కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోన్ 2 కమిషనర్ కే కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు, మొత్తం 17 వినతులు స్వీకరించినట్లు జోన్ 2 కమిషనర్ కనకమహాలక్ష్మి తెలిపారు. వినతులను విభాగాలవారిగా ప్రణాళికా విభాగమునకు:06, ఈ ఈ(వర్క్స్)-04, వాటర్ సప్లై విభాగమునకు-02, ఎలక్ట్రికల్ విభాగమునకు-01,పబ్లిక్ హెల్త్ -03 UCD- 04 వచ్చినవి. సదరు దరఖాస్తుల పై సమగ్ర విచారణ చేసి తగు చర్యల నిమిత్తం ఆయా విభాగాముల అధికారులకు అందజేయడమైనది అని తెలిపారు.