కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించక నష్టపోయే ప్రమాదం ఉందని పొగాకు రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, రైతుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. పన్నుల విధానం వల్ల రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని విన్నవించారు.