అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కొండ లక్ష్మణ్ బాపూజీ తన జీవిత చరమాంకం వరకు ఉద్యమాలతో ఊపిరి పోసి రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడి అమరుడైన మహా నాయకుడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ లో పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు వర్గాల కోసం తెలంగాణ విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. తన ఆస్తులను తెలంగాణ సమాజానికి అంకితం చేశారని అన్నారు.