అక్రమంగా మద్యం తీసుకు వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంతకవిటి మండలం, జిఎస్ పురం గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఓ వ్యక్తిని ఎస్ఐ షేక్ శంకర్ మరియు సిబ్బంది శనివారం రాత్రి 7 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 50 బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు.