మంగళవారం రోజున నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్‌చంద్ చౌరస్తా సమీపం ఏకశిలా కెమికల్ లిమిటెడ్ యూనిట్ వన్ లో ప్రజలకు హాని కలిగించే కెమికల్స్ తయారు చేస్తున్నారని,ఆ కెమికల్స్ వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు నాచారంలోని ఏకశిలా కెమికల్స్ లిమిటెడ్ యూనిట్ వన్ లో తప్పిదాలు జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు ఉద్యోగస్తులను తొలగించడంతో శివప్రసాద్, ప్రవీణ్ అనే వ్యక్తులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు.