అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం 11:30 గంటల సమయంలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాప్తాడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సిపిఐ పార్టీ ఆవిర్భావం నుంచి పేదల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుందని అదే విధంగా భారతదేశ స్వతంత్రం కోసం కూడా సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని రాప్తాడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు.